వివాహేతర సంబంధాలు.. అగ్ర స్థానంలో నిలిచిన బెంగళూరు

by Malleboina Mahesh |

వివాహేతర సంబంధాల సంఖ్యలో బెంగళూరు నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. దీనిని ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం ‘గ్లీడెన్‌’ (Gleeden) తాజా అధ్యయనంలో వెల్లడించింది.

వివాహేతర సంబంధాలు.. అగ్ర స్థానంలో నిలిచిన బెంగళూరు
X

దిశ, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధాల (Extramarital affairs) సంఖ్యలో బెంగళూరు నగరం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సమాచారాన్ని ఫ్రెంచ్ డేటింగ్ ప్లాట్‌ఫాం ‘గ్లీడెన్‌’ (Gleeden) తాజా అధ్యయనంలో వెల్లడించింది. భారతదేశంలో గ్లీడెన్ యాప్‌ ద్వారా నమోదు చేసిన వినియోగదారులలో 20 శాతం మంది బెంగళూరుకు చెందిన వారే ఉన్నారని స్పష్టం చేసింది. అలాగే బెంగళూరు తరువాతి స్థానాల్లో ముంబయి (19%), కోల్‌కతా (18%), ఢిల్లీ (15%), పూణె (10%) ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా మూడు మిలియన్లకు పైగా వ్యక్తులు ఈ ప్లాట్‌ఫాంలో యాక్టీవ్ గా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ అధ్యయనంలో ముఖ్యంగా ఐటీ, వైద్య రంగాల్లో పనిచేసే ఉద్యోగులు వివాహేతర సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఈ సంస్థ వివరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 33 శాతం మంది “పని-జీవితం సంతులనం లోపించడం”ను కారణంగా పేర్కొనగా, 58 శాతం మంది “భావోద్వేగ అనుబంధం కోసం” ఇలాంటి సంబంధాలను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. గ్లీడెన్ నివేదిక ప్రకారం, టియర్-1 నగరాలతో పాటు టియర్-2 నగరాల్లో కూడా ఈ ధోరణి పెరుగుతుంది. ఈ రిపోర్ట్‌పై సామాజిక విశ్లేషకులు కుటుంబ బంధాలు, ఒత్తిడులు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సమతుల్యత తగ్గిపోతున్నదనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వివాహేతర సంబంధాల్లో హైదరాబాద్ నగరం అధికారికంగా టాప్ 5 లో లేక పోవడం గమనార్హం.

Next Story