టెకీ అతి తెలివి..కంపెనీ క్రెడిట్ కార్డుతో జల్సాలు చేసి మేనేజర్‌కు అశ్లీల చిత్రాలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-21 12:26:52  IST  )

బెంగళూరులో ఐటీ ఉద్యోగి కంపెనీ క్రెడిట్ కార్డుతో రూ.27 లక్షలు స్వాహా చేశాడు. అడిగినందుకు మేనేజర్‌ను అసభ్య చిత్రాలతో బెదిరించాడు.

టెకీ అతి తెలివి..కంపెనీ క్రెడిట్ కార్డుతో జల్సాలు చేసి  మేనేజర్‌కు అశ్లీల చిత్రాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తాము పని చేస్తున్న కార్యాలయం, విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ టెకీ భారీ మోసానికి తెగబడ్డాడు. కంపెనీ ఇచ్చిన కార్పొరేట్ క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేయడమే కాకుండా తన గుట్టు రట్టు కావడంతో తన మేనేజర్‌కు అశ్లీల చిత్రాలు పంపుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. అతడు చేసిన తప్పును సరిదిద్దుకునేందుకు సదరు సంస్థ ఇచ్చిన అవకాశాలను చేజార్చుకోవడమే కాకుండా అతి తెలివి ప్రదర్శించడంతో చివకు వ్యవహరాం పోలీసుల వరకు వెళ్లింది. బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీ ఉద్యోగి చేసిన ఈ ఘనకార్యం ఇప్పుడు వైరల్ గా మారింది.

పాకిస్తాన్, చైనా అంటూ నాటకాలు:

బెంగళూరులో ఉన్న ఓ సాఫ్ట్ వేర్ సంస్థ తన ఉద్యోగికి అధికారిక ఖర్చుల కోసం రూ.2 లక్షల పరిమితి కలిగిన కార్పొరేట్ క్రెడిట్ కార్డును జారీ చేశారు. అయితే ఆ ఉద్యోగి అక్టోబర్ 2023 నుండి జనవరి 2024 మధ్య నాలుగు నెలల కాలంలో ఏకంగా రూ. 27,01,139లను దుర్వినియోగం చేసినట్లు యాజమాన్యం గుర్తించింది. దీంతో ఈ ఖర్చులలో తేడాలపై వివరణ ఇవ్వాలంటూ 12 జనవరి 2024న సదరు ఉద్యోగిని ఈమెయిల్ ద్వారా వివరణ కోరింది. ఇక తాను అన్నిరకాలుగా ఇరుక్కుపోయానని గ్రహించిన సదరు ఉద్యోగి చేసేదేమి లేక జనవరి 15న తన తప్పును అంగీకరించాడు. అయితే తాను చైనా, పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తుల బెదిరింపుల వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని వింత వాదన వినిపించాడు.

అసభ్యకర చిత్రాలతో బెదిరింపులు:

తన గుట్టు రట్టు కావడంతో తాను వాడుకున్న డబ్బులను మూడు వాయిదాల్లో తిరిగి చెల్లిస్తానని సంస్థకు హామీ ఇచ్చాడు. జనవరి 29న పంపిన ఈమెయిల్‌లో ఫిబ్రవరి రెండో వారంలోపు రూ. 10 లక్షలు చెల్లిస్తానని, మిగిలిన మొత్తాన్ని తర్వాత చెల్లిస్తానని పేర్కొన్నాడు. కానీ నిర్ణీత సమయంలో సదరు ఉద్యోగి డబ్బును తిరిగి చెల్లించకపోగా కంపెనీ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో 9, ఫిబ్రవరి 2024న సదరు ఉద్యోగి తన మేనేజర్‌కు అసభ్యకరమైన చిత్రాలను పంపడమే కాకుండా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వర్తూరు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు.

90 శాతం మహిళల రాజకీయ జీవితం మొదలయ్యేది పురుషుల బెడ్ రూమ్ నుంచే.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Next Story