90 శాతం మహిళల రాజకీయ జీవితం మొదలయ్యేది పురుషుల బెడ్ రూమ్ నుంచే.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-21 12:26:03  IST  )

రాజకీయాల్లో మహిళల ప్రవేశంపై ఎంపీ పప్పు యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బిహార్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

90 శాతం మహిళల రాజకీయ జీవితం మొదలయ్యేది పురుషుల బెడ్ రూమ్ నుంచే.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ బిహార్ రాష్ట్రానికి చెందిన ఇండిపెండెంట్ ఎంపీ పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 90 శాతం మంది మహిళలు పురుష రాజకీయ నాయకుల గదుల్లో గడపకుండా తమ పొలిటికల్ కెరీర్‍లో కొనసాగలేరని హాట్ కామెంట్స్ చేశారు. మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ కోసం ఉద్దేశించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో తాజాగా ఈ అంశంపై మాట్లాడిన పప్పు యాదవ్ 'భారతదేశంలో మహిళలను దేవతలుగా పిలుస్తారు. కానీ ఇక్కడ వారికి ఎప్పటికీ గౌరవం దక్కదు. దీనికి వ్యవస్థ, సమాజం రెండూ బాధ్యత వహించాలి. రాజకీయాల్లోకి రావాలంటే 90 శాతం మహిళలు పురుష రాజకీయ నాయకుల గదుల్లోకి వెళ్లకుండా ముందుకు వెళ్లలేరు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారు రాబందులు:

చాలా మంది పురుష రాజకీయ నాయకులను రాబందులుగా అభివర్ణించిన పప్పు యాదవ్.. గృహ హింసకు పాల్పడుతున్నది ఎవరు? మహిళలపై కన్నేసినదెవరు? అమెరికా నుంచి భారతదేశం వరకు మహిళలను దురుద్దేశంతో చూస్తున్నదెవరు? రాజకీయ నాయకులే కదా అని ఆరోపించారు. ఒక రాజకీయ నాయకుడి పడకగదిలోకి ప్రవేశించకుండా మెజారిటీ మహిళలను రాజకీయాల్లోకి ఎంట్రీ కూడా కానివ్వడం లేదని, రాజకీయ నాయకుల సీసీటీవీ ఫుటేజీలు ప్రతిరోజూ బయటకు వస్తున్నాయన్నారు. మహిళలను దోపిడీ చేయడం ఇప్పుడు ఒక సంస్కృతిగా మారిపోయిందన్నారు. పప్పు యాదవ్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరం అని ఆయన వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకుడు షెహజాద్ పూనావాలా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న నాయకుడి మాటలు మహిళల పట్ల ప్రతిపక్షాల మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు.

మహిళా కమిషన్ నోటీసులు:

ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన బీహార్ మహిళా కమిషన్ పప్పు యాదవ్ కు నోటీసులు జారీ చేసింది. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఎందుకు చేశారో వివరణ కోరింది. అలాగే మీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లోక్ సభ స్పీకర్‍కు ఎందుకు సిఫార్సు చేయకూడదనో చెప్పాలని ప్రశ్నించింది. రాజకీయాల్లోకి వచ్చే మహిళలు ఏదో ఒక రాజకీయ నాయకుడితో బెడ్ షేర్ చేసుకునే వస్తారని మీరు వ్యాఖ్యానించారు. ఇది మహిళల ఆత్మగౌరవాన్ని, సామాజిక ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉందని కమిషన్ పేర్కొంది.ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోపు స్పష్టమైన సమాధానాన్ని కమిషన్ కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించింది.

టెకీ అతి తెలివి..కంపెనీ క్రెడిట్ కార్డుతో జల్సాలు చేసి మేనేజర్‌కు అశ్లీల చిత్రాలు

Next Story