- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengaluru Metro Train : ఐపీఎల్ ప్రేమికులకు గుడ్ న్యూస్... బెంగుళూర్ మెట్రో వేళల పొడిగింపు
ఐపీఎల్(IPL) క్రికెట్ ప్రేమికులకు భారీ గుడ్ న్యూస్.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్(IPL) క్రికెట్ ప్రేమికులకు భారీ గుడ్ న్యూస్. ఐపీఎల్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకొని మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో మెట్రోరైలు(Metro Train) వేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది బెంగుళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL). అయితే ఈ పొడిగింపు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే నిర్దిష్ట రోజుల్లో మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రోజులు ఏప్రిల్ 2, 10, 18, 24 మరియు మే 3, 13, 17 తేదీల్లో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswami Stadium)లో జరిగే మ్యాచ్‌ల సమయంలో ఈ పొడిగింపు అమలులో ఉండనుంది.
వైట్‌ఫీల్డ్ (కాడుగోడి), చల్లఘట్ట, సిల్క్ ఇన్‌స్టిట్యూట్, మడవర నుండి చివరి రైలు రాత్రి 12:30 గంటలకు బయలుదేరగా.. నాదప్రభు కెంపేగౌడ స్టేషన్ (మజెస్టిక్) నుండి చివరి రైలు రాత్రి 1:15 గంటలకు బయలుదేరుతుంది. అయితే BMRCL ప్రయాణికులకు ఒక ముఖ్య సూచన చేసింది. ముందుగానే QR టికెట్లను WhatsApp, నమ్మ మెట్రో యాప్ లేదా PayTM ద్వారా కొనుగోలు చేయాలని. దీనివల్ల రద్దీ సమయంలో టికెట్ కౌంటర్ల వద్ద ఆలస్యం జరగకుండా ఉంటుందని తెలిపింది.






