- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జుబీన్‌కు విషమిచ్చారు.. మేనేజర్, ఆర్గనైజర్‌పై సంచలన ఆరోపణలు
జుబీన్‌కు విషమిచ్చారంటూ అతని మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్‌పై సంచలన ఆరోపణలు వెలుగు చూశాయి. జుబీన్ బ్యాండ్‌మేట్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దిశ, నేషనల్ బ్యూరో: స్టార్ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసులో సంచలన విషయం బయటకొచ్చింది. జుబీన్‌కు విషమిచ్చారంటూ అతని బ్యాండ్‌లో కీలక సభ్యుడైన శేఖర్ జ్యోతి గోస్వామి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, ఫెస్టివల్ ఆర్గనైజర్ శ్యాంకను మహంతా కలిసి జుబీన్‌కు విషమిచ్చి, అతని మరణాన్ని యాక్సిడెంట్‌గా చిత్రీకరించి ఉంటారని శేఖర్ ఆరోపించారు. సింగపూర్‌లో జుబీన్ మరణించే ముందు సిద్ధార్థ్ అనుమానాస్పదంగా ప్రవర్తించాడని అధికారులకు శేఖర్ చెప్పారు.
సింగపూర్‌లోని అసోం అసోసియేషన్ సభ్యులు, ఎన్నారై తన్మయ్ ఫూకన్ డ్రిక్స్ ఎరేంజ్ చేస్తుండగా సిద్ధార్థ్ అడ్డుకున్నాడని, కేవలం తనే డ్రింక్స్ అందిస్తానని పట్టుపట్టాడని శేఖర్ గుర్తుచేసుకున్నారు. ఊపిరందక జుబీన్ మునిగిపోతుంటే.. ‘వదిలేయండి.. వదిలేయండి’ అని సిద్ధార్థ్ కేకలు వేశాడని కూడా ఆయన తెలిపారు. ఇవన్నీ చూసిన తర్వాత తనకు అనుమానం కలుగుతోందని అధికారులకు శేఖర్ చెప్పుకొచ్చారు.






