- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచి ముహూర్తం చూసి.. ఆఫీస్ మర్చేసిన బండి సంజయ్
by Gantepaka Srikanth |
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఈరోజు తన శాఖ కార్యాలయాన్ని కర్తవ్య భవన్(Kartavya Bhawan)లోకి మార్చారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ఈరోజు తన శాఖ కార్యాలయాన్ని కర్తవ్య భవన్(Kartavya Bhawan)లోకి మార్చారు. సెంట్రల్ విస్టా రీ డెవలెప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నూతనంగా నిర్మించిన “కామన్ సెంట్రల్ సచివాలయం”ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ గత ఆగస్టు 6న ప్రారంభించిన సంగతి తెలిసిందే. సుమారు 1.5 లక్షా చదరపు మీటర్ల ప్లింట్ ఏరియా కలిగి ఉన్న ఈ భవనం, రెండు బేస్‌మెంట్‌లతో పాటు 7 అంతస్తులుగా నిర్మించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు సహాయ మంత్రి నిత్యానందరాయ్ కార్యాలయాలు ఇప్పటికే కర్తవ్య భవన్‌లోని లెవెల్ 5లోకి మారాయి. దీపావళి సందర్భంగా ఈరోజు మంచి మహూర్తం ఉండటంతో బండి సంజయ్ పూజారుల వేద మంత్రోచ్చారణల కర్తవ్య భవన్‌లోకి మధ్య అడుగుపెట్టారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనకు కేటాయించిన సీట్లో ఆశీసునలయ్యారు.
Next Story






