టర్కీకి మరో దెబ్బ..ఆ దేశ ఆపిల్స్ పైనా నిషేదం?

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో ట‌ర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి డ్రోన్లను పంపడంతో పాటూ వాటిని ఆపరేట్ చేసేందుకు తమ ఆర్మీ సిబ్బందిని సైతం పంపించింది.

టర్కీకి మరో దెబ్బ..ఆ దేశ ఆపిల్స్ పైనా నిషేదం?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న స‌మ‌యంలో ట‌ర్కీ పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ దేశానికి డ్రోన్లను పంపడంతో పాటూ వాటిని ఆపరేట్ చేసేందుకు తమ ఆర్మీ సిబ్బందిని సైతం పంపించింది. పాకిస్థాన్‌తో తమ మైత్రి కొనసాగుతుందని బహిరంగంగా ప్రకటించింది. దీంతో భారత్ నుండి ఆ దేశానికి టూరిస్టులు ఎవరూ వెళ్లడం లేదు. ఇక ఇప్పుడు ఆ దేశ ఆపిల్స్ కూడా నిషేదించాలంటూ హిమాచల్ ప్రదేశ్ పండ్ల ఉత్పత్తి దారులు కోరుతున్నారు.

టర్కీ నుండి ఆపిల్స్ దిగుమతులను నిషేదించాలని హిమాచల్ ప్రదేశ్ పండ్ల ఉత్పత్తి దారుల సంయుక్త మంచ్ కోరుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ద్వారా రాష్ట్రపతి మరియు ప్రధాన మంత్రికి వినతీ పత్రాన్ని పంపింది. ఇదిలా ఉంటే భారత్ కు ఆపిల్స్ ఎగుమతి చేస్తున్న దేశాల్లో టర్కీ కూడా ఉంది. ప్రతి ఏడాది టర్కీ నుండి 800 నుండి 1000 కోట్ల రూపాయల ఆపిల్స్ వరకు భారత్ దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఆ దేశ ఆపిల్స్ పై సైతం నిషేదం విధించాలని హిమాచల్ ప్రదేశ్ పండ్ల ఉత్పత్తి దారులు కోరుతుండగా ప్రజలు సైతం వారికి మద్దతు ప్రకటిస్తున్నారు.

Next Story