Fastag : ఆ ఫాస్టాగ్ లపై నిషేధం

by Muthe.Rajitha |

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Fastag : ఆ ఫాస్టాగ్ లపై నిషేధం
X

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 'లూజ్ ఫాస్టాగ్'(Loose Fastag) లను నిషేధించనుంది. లూజ్ ఫాస్టాగ్ ల సమాచారాన్ని టోల్ గేట్ కలెక్టివ్ ఏజెంట్లు NHAI కి రిపోర్ట్ చేయాలని సూచించింది. జనరల్ గా వాహనదారులు తమ ఫాస్టాగ్ ను వెహికిల్ విండ్ షీల్డ్ పై అతికిస్తారు. అపుడు టోల్ గేట్ వద్ద స్కానర్లు వాటిని ఈజీగా స్కాన్ చేసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది వాహనదారులు మాత్రం ఫాస్టాగ్ లను టోల్ గేట్ వచ్చినపుడు పర్స్నుంచి తీసి చూపిస్తున్నారు. దీనినే లూజ్ ఫాస్టాగ్ అంటారు.

దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ పెరుగుతోంది. దీనిని కట్టడి చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ అలాంటి లూజ్ ఫాస్టాగ్ లపై చర్యలకు దిగుతోంది. ఇకపై అలాంటి ఫాస్టాగ్ లను బ్లాక్ లిస్టులోకి చేర్చనుంది. ఇందుకోసం ప్రత్యేక ఈమెయిల్ ఐడీని టోల్ ప్లాజా నిర్వాహకులకు అందజేసింది.

Next Story