- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువతిపై రెచ్చిపోయిన రాపిడో డ్రైవర్.. బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం
కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bangalore) నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రాపిడో బైక్ డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక(Karnataka) రాజధాని బెంగళూరు(Bangalore) నగరంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై రాపిడో బైక్ డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా యువతి డ్రైవర్‌తో గొడవకు దిగింది. బైక్ దిగిన అనంతరం డబ్బులు చెల్లించేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు బైక్ డ్రైవర్ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బలంగా డ్రైవర్ చెంప దెబ్బ కొట్టడంతో యువతి నేలపై పడిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించి విచారించింది. మొత్తం కర్ణాటక వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలపై నిషేధం విధించింది.
ఈ నిషేధం ఇవాళ్టి(16-06-2025) నుంచే అమల్లోకి వస్తుందని ఆదేశాల్లో పేర్కొంది. అంతేగాకుండా.. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నడిపిస్తున్న పలు బైక్ ట్యాక్సీలను సీజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీవో అధికారుల తనిఖీలు చేస్తున్నారు. మోటారు వాహనాల చట్టం కింద స్పష్టమైన నియమాలు రూపొందించే వరకు కర్ణాటక హైకోర్టు ఈ సేవలను చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఈ నిర్ణయంతో బెంగళూరు, కర్ణాటకలోని ఇతర నగరాల్లోని లక్షలాది మంది ప్రయాణికులకు జర్నీ సమస్యలు ఎదురుకానున్నాయి. రాపిడో, ఉబర్ మోటో వంటి ఆపరేటర్లకు పెద్ద ఎదురుదెబ్బ తగలినట్లైంది. వీడియో






