- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలూచిస్తాన్‌కు స్వతంత్రం..ఢిల్లీలో ఎంబసీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్!
by Phanindra |
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. తమకు మద్దతివ్వాలని భారత్ సహా ప్రపంచ దేశాలను కోరింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో బలూచిస్తాన్ సంచలన ప్రకటన చేసింది. తమకు పాకిస్తాన్ నుంచి స్వతంత్రం వచ్చిందని, భారత్‌లో బలూచిస్తాన్ ఎంబసీ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతివ్వాలని పేర్కొంది. బలూచిస్తాన్ హక్కుల కోసం పోరాడే ప్రముఖ రచయిత మీర్ యార్ బలోచ్ ఈ మేరకు సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అంతర్జాతీయ సహకారం కూడా అవసరమన్న ఆయన.. ఐక్యరాజ్యసమితి కూడా తమకు గుర్తింపునివ్వాలని కోరారు.
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ త్వరలోనే నాశనం అవుతుందని, ఈ క్రమంలో పాక్ ఆర్మీని తమ దేశం నుంచి పంపేయడం కోసం యూఎన్ పీస్‌కీపర్స్‌ను పంపాలని డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాలన్నీ తమకు సహకారం ఇవ్వాలని అభ్యర్థించారు. కాగా, పాకిస్తాన్ సైనిక స్థావరాలపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






