Baloch rebels: 214 మంది పాక్ సైనికులను చంపేశాం.. బలూచ్ తిరుగుబాటుదారుల ప్రకటన

by Shamantha N |   (  Updated:2025-03-15 15:09:08  IST  )

పాకిస్థాన్ లో రైలు హైజాక్ ఘటనలో బలూచ్ కీలక ప్రకటన చేసింది. బందీలుగా ఉన్న 214 మంది సైనికులను చంపేశామని బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

Baloch rebels: 214 మంది పాక్ సైనికులను చంపేశాం.. బలూచ్ తిరుగుబాటుదారుల ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ లో రైలు హైజాక్ ఘటనలో బలూచ్ కీలక ప్రకటన చేసింది. బందీలుగా ఉన్న 214 మంది సైనికులను చంపేశామని బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించని కారణంగా జాఫర్ ఎక్స్ ప్రెస్ నుంచి బందీలుగా అదుపులో తీసుకున్న పాక్ సైనికులను చంపేసినట్లు బలూచ్ లిబరేషన్ ప్రకటించింది. తమరాజకీయ ఖైదీలను విడుదల చేయాలని విధించిన 48 గంటల గడువు ముగిసిందని పేర్కొంది. పాక్ ప్రభుత్వం మొండితనంగా వ్యవహరించడంతో తమ చేతలకు పనులు చెప్పామని వెల్లడించింది. బలూచ్ రాజకీయ ఖైదీలు, కార్యకర్తలను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఉగ్రవాదులు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. వారిని పాకిస్తాన్ సైన్యం అపహరించిందని పేర్కొన్నారు. బలూచ్ రాజకీయ ఖైదీలతో వారిని మార్పిడి చేసుకునే ఒప్పందం కోసం వారి 48 గంటల గడువు శుక్రవారం ముగిసింది. అయితే, పాకిస్థాన్ తన సాంప్రదాయ మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించిందని తిరుగుబాటు దారులు మండిపడ్డారు. తీవ్రమైన చర్చలను తప్పించుకోవడమే కాకుండా వాస్తవాలను కూడా పట్టించుకోలేదన్నారు. ఈ మొండితనం ఫలితంగా 214 మంది బందీలు బలయ్యారని బలూచ్ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ..

కాగా.. పాకిస్థాన్ నుండి బలూచిస్థాన్ విడిపోవాలని కోరుకునే వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మంగళవారం రైల్వే ట్రాక్‌లను పేల్చివేసి పెషావర్‌కు వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది. ఆ రైలులో 400 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. బందీలను విడిపించేందుకు పాక్ సైన్యం ఆపరేషన్ ప్రారంభించింది. బుధవారం 30 గంటల ఆపరేషన్ తర్వాత ముట్టడి ముగిసిందని వెల్లడించింది. ఈ దాడిలో 33 మంది సైనికులు, ముగ్గురు రైల్వే ఉద్యోగులు, ఐదుగురు ప్రయాణికులు మరణించారని సైన్యం పేర్కొంది. అయితే, బలూచ్ తిరుగుబాటుదారులు పాక్ వాదనను తిప్పికొట్టారు. తీవ్రమైన పోరాటం జరుగుతోందని.. భద్రతా దళాలు "భారీ నష్టాలను చవిచూస్తున్నాయని" చెప్పారు. దరా-ఎ-బోలాన్ అనే ఆపరేషన్‌లో తమ 12 మంది సిబ్బంది మరణించారని బీఎల్ఏ వెల్లడించింది.

Read Also..

Emergency: ఎమర్జెన్సీ: ఇది బీజేపీ కథేనా?

Next Story