పాకిస్థాన్ కు షాక్.. 200 మంది సైనికులను బంధించిన బలూచిస్తాన్ ?

by velandi.Saikiran |

పాకిస్తాన్ దేశం ( Pakisthan) ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. పాకిస్తాన్ పై పగ తీర్చుకునేందుకు మోడీ ( Modi) ప్రభుత్వం... వ

పాకిస్థాన్ కు షాక్.. 200 మంది సైనికులను బంధించిన బలూచిస్తాన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ దేశం ( Pakisthan) ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. పాకిస్తాన్ పై పగ తీర్చుకునేందుకు మోడీ ( Modi) ప్రభుత్వం... వ్యూహరచనలు చేస్తున్న నేపథ్యంలో...బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా.. మరోవైపు చుక్కలు చూపిస్తోంది. దీంతో.. పాకిస్తాన్ ఆర్మీ బలైపోతుంది. పాకిస్తాన్ సైనికులను బంధించి మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేస్తోంది. ఇప్పటికే చాలా మంది పాకిస్తాన్ సామాన్యులను కూడా చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ.

తాజాగా... మరో 200 మంది పాకిస్తాన్ సైనికులు ( Pakisthan army) అలాగే ఉన్నతాధికారులను కూడా బంధించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారిక ప్రకటన చేసినట్లు సమాచారం అందుతుంది. పాక్ దళాలపై... రోజురోజుకు పట్టు బిగిస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ( Balochistan Liberation Army). అదే సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పై నియంత్రణ కోల్పోతుంది పాకిస్తాన్. క్వేట్టా నగరాన్ని స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది లిబరేషన్ ఆర్మీ.

ఇప్పటికే పాకిస్తాన్ లోని మంగు చోర్ ప్రాంతాన్ని.. స్వాధీనం కూడా చేసుకుంది. పాక్ సైనికులతో పాటు అధికారులను కూడా తాజాగా బంధించింది. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించాలని మొదటి నుంచి లిబరేషన్ ఆర్మీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పై ఉగ్రదాడులకు కూడా పాల్పడుతోంది. అయితే.. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులను ఎదుర్కోలేక పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతోంది.

Next Story