- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యాపిల్లల కళ్లముందే బలూచ్ జర్నలిస్టు దారుణ హత్య
భార్యాపిల్లల కళ్లముందే బలూచ్ జర్నలిస్టు దారుణ హత్య. మానవ హక్కుల ఉల్లంఘనపై మౌనం వీడాలని అంతర్జాతీయ మీడియాకు బలూచ్ కమిటీ డిమాండ్.

దిశ, నేషనల్ బ్యూరో: బలూచిస్తాన్‌లో ఒక జర్నలిస్టును కుటుంబ సభ్యుల కళ్లముందే కొందరు దారుణంగా కాల్చి చంపారు. అబ్దుల్ లతీఫ్ అనే బలూచ్ జర్నలిస్టును కొందరు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, ఎదురు తిరగడంతో భార్యాపిల్లల కళ్లముందే అతన్ని కాల్చి చంపారని బలూచ్ యాక్జేటీ కమిటీ వెల్లడించింది. లతీఫ్ గతంలో డైలీ ఇంతిఖాబ్, ఆజ్ న్యూస్ అనే సంస్థల్లో పనిచేశాడని, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై ధైర్యంగా రిపోర్టులు రాసేవాడని తెలుస్తోంది. లతీఫ్ ఇంట్లోకి చొరబడిన దుండగులు అతన్ని కిడ్నాప్ చేయబోయారని, అతను ప్రతిఘటించడంతో అక్కడికక్కడే కాల్చిచంపారని స్థానిక పోలీసులు చెప్పారు.
ఇది ఒక కుటుంబానికి జరిగిన నష్టం కాదని, ఒక ఉగ్రచర్య అని బలూచ్ యాక్జేటీ కమిటీ పేర్కొంది. ఇదంతా పాకిస్తాన్ ఆర్మీనే చేయిస్తోందని, బలూచిస్తాన్‌లో జరుగుతున్న ఘోరాలను బయటపెడుతున్న జర్నలిస్టులను ఏరిపారేయడానికి పాకిస్తాన్ ఆర్మీ ప్రయత్నిస్తోందని కమిటీ అంటోంది. ఇలాంటి ఘటనలపై అంతర్జాతీయ మీడియా, ఐక్యరాజ్య సమితి, ప్రెస్ ఫ్రీడమ్ సంస్థలు మౌనం వీడాలని డిమాండ్ చేసింది.






