- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
నేపాల్‌లో రాజకీయ ముఖచిత్రం మారింది. ఆ దేశ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకరాం చేసి పదవీ బాధ్యతలను స్వీకరించారు.

దిశ, వెబ్‌డెస్క్: పొరుగు దేశం నేపాల్‌లో నేపాల్ ప్రభుత్వం మారింది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) అధ్యక్షుడు బాలేంద్ర షా ఇవాళ ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్చి 5న జరిగిన ప్రతినిధుల సభ ఎన్నికల్లో ఆయన పార్టీ 182 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ‘శీతల్ నివాస్’లో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్ బాలేంద్ర షాతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకలో రాజకీయ హంగులతో పాటు సంప్రదాయం ఉట్టిపడింది. 108 మంది బటుల శంఖనాదాలు, స్వస్తి వాచనాలు, 16 మంది బౌద్ధ భిక్షువుల అష్టమంగళ ప్రార్థనల మధ్య ఈ క్రతువు సాగింది. బాలేంద్ర షా తనదైన శైలిలో నల్లటి దుస్తులు, డార్క్ సన్ గ్లాసెస్ ధరించి ప్రమాణ స్వీకారానికి హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
ప్రధాని మోదీ శుభాకాంక్షలు
బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా అభినందనలు తెలిపారు. ‘నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బాలేంద్ర షాకు హృదయపూర్వక అభినందనలు. భారత్-నేపాల్ మధ్య ఉన్న పురాతన స్నేహ సంబంధాలను, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. .






