Delhi: పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య, అజిత్

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-28 13:26:11  IST  )

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)లో పద్మ అవార్డుల ప్రదానం అట్టహాసంగా ప్రారంభమైంది.

Delhi: పద్మభూషణ్ అవార్డు అందుకున్న బాలయ్య, అజిత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌(Rashtrapati Bhavan)లో పద్మ అవార్డుల ప్రదానం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో ప్రధాని మోడీ(PM Modi), కేంద్ర మంత్రులు అమిత్ షా(Amit Sha), శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రహీతలు అవార్డులు అందుకున్నారు. ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణ(Balakrishna), అజిత్‌(Ajith), డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పద్మ భూషన్ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డుల వేడుకకు బాలయ్య తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో హాజరయ్యారు. కాగా, 2025 గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనవరి 25న పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు వరించాయి. అందులో 113 పద్మశ్రీ, 19 పద్మభూషణ్, ఏడు పద్మభూషణ్ పురస్కారాలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల నుంచి నుంచి డాక్టర్‌ దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి పద్మ విభూషణ్, నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్‌ అవార్డు అందుకోగా, ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణిశర్మ, రచయిత కేఎల్‌ కృష్ణ, మిరియాల అప్పారావు, వాధిరాజు రాఘవేంద్రాచార్యలకు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు.

Next Story