Bakrid : ఈనెల 7న బక్రీద్.. యూపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు

by Muthe.Rajitha |

ఈనెల 7న జరగనున్న బక్రీద్(Bakrid) పండగ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం(UP Govt) పలు కఠిన ఆంక్షలు జారీ చేసింది.

Bakrid : ఈనెల 7న బక్రీద్.. యూపీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఈనెల 7న జరగనున్న బక్రీద్(Bakrid) పండగ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం(UP Govt) పలు కఠిన ఆంక్షలు జారీ చేసింది. యూపీలో బక్రీద్ సమయంలో రోడ్లపై నమాజ్ చేయడంపై నిషేధం విధించారు. ఆవులను, ఒంటెను, నీలగాయిని బలి ఇవ్వడం నిషేదించారు. గొర్రెల బలి కూడా కేవలం నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే అనుమతించబడుతుందని తెలిపారు. ఎక్కడైనా గొడవలు జరిగితే తక్షణమే చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. బలి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, చట్టపరమైన నిషేధాలు లేని జంతువులను మాత్రమే బలి ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ ఆంక్షలు శాంతి భద్రతలను కాపాడేందుకు, ఇతర మతాల ప్రజల మనోభావాలను గౌరవించేందుకు ఉద్దేశించినవని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ ఆంక్షలపై ముస్లిం సమాజం అసంతృప్తి వ్యక్తం చేసింది.

Next Story