- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమికుల రోజు ఈవెంట్ కాదు! భజరంగ్ దళ్ హల్ చల్.. కాలేజీలో ఫర్నిచర్ ధ్వంసం!
పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకమంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇండోర్‌లోని ప్రముఖ నర్సీ మాంజీ (NMIMS) కాలేజీలో హల్ చల్ చేశారు. విద్యార్థులు నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌ను వాలంటైన్స్ డే పార్టీగా అపార్థం చేసుకున్న కార్యకర్తలు.. క్యాంపస్‌లోకి చొరబడి విధ్వంసానికి దిగారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) వేళ మధ్యప్రదేశ్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాశ్చాత్య సంస్కృతికి వ్యతిరేకమంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఇండోర్‌లోని ప్రముఖ నర్సీ మాంజీ (NMIMS) కాలేజీలో హల్ చల్ చేశారు. విద్యార్థులు నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌ను వాలంటైన్స్ డే పార్టీగా అపార్థం చేసుకున్న కార్యకర్తలు.. క్యాంపస్‌లోకి చొరబడి విధ్వంసానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. గురువారం ఇండోర్‌లోని ఎన్‌ఎమ్‌ఐఎమ్‌ఎస్ క్యాంపస్‌లో విద్యార్థులు 'బేక్ & సెల్' (Bake & Sell) పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే, దీనిని ప్రేమికుల రోజు సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్నారని భావించిన భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. భద్రతా సిబ్బందిని దాటుకుని లోపలికి ప్రవేశించి.. ఈవెంట్ కోసం ఏర్పాటు చేసిన స్టేజీని, కుర్చీలను, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. కార్యకర్తల అత్యుత్సాహంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: డీసీపీ
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇండోర్ జోన్-1 డీసీపీ కృష్ణ లాల్‌చందానీ మాట్లాడుతూ.. ‘కాలేజీలో కార్యక్రమం జరుగుతుండగా ఒక హిందూ సంఘం కార్యకర్తలు వచ్చి వేదికను ధ్వంసం చేశారు. విద్యార్థులను సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించాం. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.
సోషల్ మీడియాలో ట్రోల్స్..
ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. విద్యార్థుల ఈవెంట్‌పై దాడి చేయడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. ట్విట్టర్ (X)లో #BajrangDal హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతుండగా.. పలువురు ఫన్నీ మీమ్స్‌తో సెటైర్లు వేస్తున్నారు.






