- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఖర్చుతో బాగేశ్వర్ బాబా పర్యటన.. కాళ్ళు మొక్కిన పోలీసు ఉన్నతాధికారి.. తీవ్ర విమర్శలు
బాగేశ్వర్ బాబాగా ప్రసిద్ధి చెందిన ధీరేంద్ర కృష్ణశాస్త్రి ఛత్తీస్‌గఢ్ పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : బాగేశ్వర్ బాబాగా ప్రసిద్ధి చెందిన ధీరేంద్ర కృష్ణశాస్త్రి ఛత్తీస్‌గఢ్ పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదం రేపుతోంది. ఆయన ప్రభుత్వ ఖర్చుతో విమానంలో ప్రయాణించడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అంతేకాద రాయ్‌పుర్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన ఓ పొలిసు ఉన్నతాధికారి బాబా కాళ్ళు మొక్కడం మరింత వివాదానికి దారి తీసింది. ఎలాంటి అధికారిక, రాజ్యాంగపరమైన హోదా లేని మత ప్రబోధకుడికి ప్రభుత్వ విమానం వినియోగించడం ఏంటని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ప్రజల పన్నుల డబ్బును ఇలాంటి అవసరం లేని ఖర్చులకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ ఘటనపై స్పందించిన రాయ్‌పుర్ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్, వీడియోలో కనిపించిన పోలీసు అధికారి పూర్తి యూనిఫాంలో లేడని, అప్పటికే టోపీ, షూ తీసివేసి ఉన్నందున సర్వీస్ నిబంధనల ఉల్లంఘన జరగలేదని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసారు.






