- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bad Debts: సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ బ్యాంకుల మొండి బాకీలు రూ. 3.16 లక్షల కోట్లు..!
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3 లక్షల కోట్లకు పైగా మొండి బాకీలు(Bad Debts) ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం(Central Govt) మంగళవారం పార్లమెంట్(Parliament)కు తెలియజేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3 లక్షల కోట్లకు పైగా మొండి బాకీలు(Bad Debts) ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం(Central Govt) మంగళవారం పార్లమెంట్(Parliament)కు తెలియజేసింది. మొత్తం రుణాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 3.09 శాతంగా ఉందని తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డేటా ప్రకారం 2024 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ. 3,16,331 కోట్ల మొండి బాకీలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఈ మొత్తం రూ. 1,34,339 కోట్లుగా ఉందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి(Pankaj Chaudhary) వెల్లడించారు. మొండి బాకీలు వాటా గవర్నమెంట్ బ్యాంకుల్లో 3.09 శాతంగా ఉందని, అదే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో వీటి శాతం 1.86 శాతంగా ఉందని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులతో పోల్చుకుంటే గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకుల్లో మొండి బాకీలు వాటా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.






