Salman Khan : సల్మాన్‌ ఖాన్ హత్యకు బాబా సిద్దిఖీ హంతకుల కుట్ర.. ఏమైందంటే..

by Hajipasha |

దిశ, నేషనల్ బ్యూరో : ముంబైలో ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ(Baba Siddique) అక్టోబరు 12న దారుణ హత్యకు గురయ్యారు.

Salman Khan : సల్మాన్‌ ఖాన్ హత్యకు బాబా సిద్దిఖీ హంతకుల కుట్ర.. ఏమైందంటే..
X

దిశ, నేషనల్ బ్యూరో : ముంబైలో ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ(Baba Siddique) అక్టోబరు 12న దారుణ హత్యకు గురయ్యారు. ఆ కేసుపై పోలీసుల దర్యాప్తులో కీలక వివరాలు బయటికి వచ్చాయి. బాబా సిద్దిఖీపై ఫైరింగ్ చేసిన ముగ్గురు షూటర్లు.. అంతకంటే ముందు సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని తెలిసింది. అయితే టైట్ సెక్యూరిటీ కారణంగా సల్మాన్‌ ఖాన్ సమీపంలోకి షూటర్లు వెళ్లలేకపోయిట్లు తేలింది.

బాబా సిద్దిఖీ హత్యలో పాత్ర ఉన్న ఒక షూటర్‌ను పోలీసులు ఇంటరాగేట్ చేయగా ఈవిషయాన్ని చెప్పాడు. ఈ షూటర్లకు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 14న రెండు బైక్‌లపై నుంచి విక్కీ గుప్తా, సాగర్ పాల్ అనే దుండగులు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపి పరారయ్యారు. అనంతరం వారిని గుజరాత్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ దుండగులకు కూడా లారెన్స్ గ్యాంగుతోనే లింకులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Next Story