- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Baba Siddique: సోషల్ మీడియాను వాడుకున్న నిందితులు
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించి ముంబయి పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. బాబా సిద్ధిఖీ హత్య కుట్ర మూడు నెలల ముందు నుంచే మొదలైందని, నిందితులు పలుమార్లు ఆయుధాలు లేకుండా ఆయన నివాసానికి వచ్చినట్టు చెప్పారు. పూణేలో ఈ హత్యా ప్రణాళిక జరిగినట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు సహా 15 మంది వ్యక్తుల వాంగ్మూలాన్ని ముంబయి క్రైం బ్రాంచీ పోలీసులు రికార్డ్ చేసినట్టు పేర్కొన్నారు. బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించి నిందితులు ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్స్ చేసుకునేవారని, స్నాప్‌చాట్‌లో చాట్ చేసుకునే వారని పోలీసులు చెప్పారు. యూట్యూబ్ వీడియోలు చూసి షూటింగ్ నేర్చుకున్నట్టూ తెలిపారు.
ముంబయిలోని నిర్మల్ నగర్ ఏరియాలో అక్టోబర్ 12వ తేదీన బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. తన కొడుకు, ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ కార్యాలయం ఎదుటే ఈ హత్య జరిగింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన గుర్మేల్ బల్జిత్ సింగ్, యూపీకి చెందిన ధర్మరాజ్ రాజేశ్ కశ్యప్, ప్రవీణ్ లొంకార్‌లను అరెస్టు చేశారు. తాజాగా యూపీ బహ్రెచ్‌కు చెందిన హరిశ్ కుమార్ బలక్రామ్ నిసాద్‌ను మంగళవారం అరెస్టు చేసినట్టు వెల్లడించారు. షూటర్లకు రూ. 2 లక్షలను ఈ నాలుగో నిందితుడు డెలివరీ చేసినట్టు పేర్కొన్నారు. డబ్బులతోపాటు రెండు మొబైల్ ఫోన్లు కూడా హరీశ్ ద్వారానే అందించినట్టు వివరించారు.