- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ayurveda Day : సెప్టెంబర్ 23.. ఆయుర్వేద దినోత్సవం : అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారతదేశంలో ఆయుర్వేద(Ayurvedam) వైద్యానికి ఎంతో గొప్ప పేరుంది.

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశంలో ఆయుర్వేద(Ayurvedam) వైద్యానికి ఎంతో గొప్ప పేరుంది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ఎంతో మంది ఆయుర్వేద వైద్యాన్ని నమ్మి, ఇండియాకు వచ్చి అనేక వ్యాధులకు చికిత్స తీసుకుంటారు. అయితే ఆయుర్వేదానికి కూడా ఓ ప్రత్యేక రోజును కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రతీ ఏటా సెప్టెంబర్ 23న "ఆయుర్వేద దినోత్సవం"(Ayurveda Day)గా నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. అయితే ఇది వరకు ఆయుర్వేద దినోత్సవాన్ని 'దంతేరాస్'(Danteras) రోజున నిర్వహించేవారు.
అయితే ప్రతిఏటా దంతేరాస్ వివిధ తేదీల్లో వస్తుండటంతో ఆయుర్వేద దినోత్సవం కూడా మారుతూ వచ్చేది. దీనిని దృష్టిలో పెట్టుకొని సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే సెప్టెంబర్ 23కు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆరోజు భూమి మీద పగలు రాత్రి సమయం నిడివి సమానంగా(Equinox) ఉంటుంది.






