- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ నెల 25న అయోధ్యలో ధ్వజారోహణం.. కాషాయ జెండా ఎగరేయనున్న ప్రధాని మోడీ
ఈ నెల 25న అయోధ్యలో ధ్వజారోహణం కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకల్లో ఆలయ శిఖరంపై ప్రధా కాషాయ జెండా ఎగరేయనున్న ప్రధాని మోడీ

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయం మరో కీలకమైన ఘట్టానికి ముస్తాబవుతోంది. ఈ నెల 25న అయోధ్య రామాలయంలో ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ ట్రస్టు ఏర్పాట్లు చేస్తోంది. బాలరాముడి ప్రాణప్రతిష్ట తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన వేడుక ఇదేనని భక్తులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ వేడుకల్లోనే ఆలయ శిఖరంపై ఆయన కాషాయ జెండా కూడా ఎగరేయనున్నారు. 161 అడుగుల ఆలయం శిఖరంపై మరో 30 అడుగుల ఎత్తుండే జెండా స్తంభాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అంటే 191 అడుగుల ఎత్తులో జెండా ఎగరేయనున్నారన్నమాట. నవంబరు 25 ఉదయం 11.58 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో జెండా ఎగరేసే కార్యక్రమం జరుగుతుంది. కాషాయ రంగులో ఉండే జెండాపై సూర్యుడు, ఓం, దేవకాంచన చెట్టు గుర్తులుండేలా డిజైన్ చేశారు. కాగా, అక్టోబరు నెలలోనే ఆలయ ప్రాంగణంలోని కీలకమైన నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ ఆలయానికి తుదిమెరుగులు దిద్దుతున్నారని సమాచారం.






