- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య విరాళాల చోరీ కేసు: యూపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల చోరీ, అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల చోరీ, అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో విచారణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా.. ఆర్థిక కేటాయింపుల లెక్కల్లో పూర్తి స్పష్టత, పారదర్శకత కోసం సిట్ బృందంలో ఒక నిపుణుడైన ఫోరెన్సిక్ ఆడిటర్‌ను చేర్చాలని యూపీ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఏ దశలో ఉందో స్పష్టం చేస్తూ తదుపరి పురోగతిపై రెండు వారాల్లో (ఆగస్టు రెండో వారంలోగా) సమగ్ర స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని సిట్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించింది.
రాజకీయ రంగు పులమవద్దు..
విరాళాల లెక్కింపు సమయంలో జరిగిన ఈ చోరీ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తూ.. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉన్న ఈ అంశానికి ఎలాంటి రాజకీయ రంగు పులమవద్దని సూచించింది. దర్యాప్తును చట్టప్రకారం, నిష్పక్షపాతంగా ముగించాలని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, సిట్ నివేదిక ఆధారంగా తదుపరి విచారణ మరింత వేగవంతం కానుంది.






