అయోధ్య రామమందిరం పరిధిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై కఠిన నిబంధనలు

by Naga Rani Yarlagadda |

అయోధ్య రామమందిరం పరిధిలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీపై అధికారులు కఠిన నిబంధనలు విధించారు.

అయోధ్య రామమందిరం పరిధిలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలపై కఠిన నిబంధనలు
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం పరిధిలో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీపై అధికారులు కఠిన నిబంధనలు విధించారు. ఆలయానికి 15 కిలోమీటర్ల దూరంలో నాన్ వెజ్ ఫుడ్స్ ఆన్ లైన్ డెలివరీని అయోధ్య యంత్రాంగం నిషేధించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే "పంచకోశి పరిక్రమ" పరిధిలో ఉన్న ప్రాంతాల్లోకి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు నాన్ వెజ్ ను సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు అందడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయోధ్య నగరంలోని కొన్ని హోటళ్లు, హోమ్ స్టేలలో అతిథులకు నాన్ వెజ్ ఫుడ్ తో పాటు మద్యం కూడా అందిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే ఇలాంటి వాటిపై యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు. కానీ ఆన్లైన్ ద్వారా మళ్లీ పర్యాటకులకు నాన్ వెజ్ ఫుడ్ సరఫరా చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో కఠిన నిబంధనలు విధించినట్లు అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ మాణిక్ చంద్ర సింగ్ తెలిపారు.

అయోధ్య, ఫైజాబాద్ లను కలిపే 14 కిలోమీటర్ల రామ్ పథ్ మార్గంలో మద్యం, మాంసం అమ్మకాలను నిషేధిస్తూ 2025 మే నెలలో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మాంసం దుకాణాలను కూడా తొగించారు. కానీ.. మద్యం అమ్మకాలపై 9 నెలలుగా నిషేధం సరిగ్గా అమలు కావట్లేదు. రెండు డజన్లకు పైగా మద్యం దుకాణాలను నడుస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మద్యం దుకాణాలపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా యంత్రాంగం అనుమతి తప్పనిసరిగా కావాలని మున్సిపల్ అధికారి వెల్లడించారు.

Next Story