యూఎస్ దాడుల భయంతో బంకర్‌లో తలదాచుకున్న ఖమేనీ!

by Phanindra |

యూఎస్ దాడులు చేస్తుందన్న భయంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ అండర్‌గ్రౌండ్ బంకర్‌లో తలదాచుకున్నారు.

యూఎస్ దాడుల భయంతో బంకర్‌లో తలదాచుకున్న ఖమేనీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అధినేత అయతొల్లా ఖమేనీ బంకర్‌లో దాక్కున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ ఇంటర్నేషనల్ సంస్థ వెల్లడించింది. ఆ దేశంపై దాడులు చేసేందుకు యూఎస్ సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలోనే ఖమేనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఖమేనీ మూడో కుమారుడు మసూద్ ఖమేనీ ప్రస్తుతం ఇరాన్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. టెహ్రాన్‌లో అత్యంత రక్షణ కలిగిన అండర్‌గ్రౌండ్ షెల్టర్‌లో ఖమేనీ తలదాచుకున్నారని, అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు సొరంగ మార్గాలు కూడా ఉన్నాయని, దీంతో ఆయన బయటకు రాకుండానే ప్రయాణాలు కూడా చేయొచ్చని, ఈ సొరంగాలన్నీ కూడా శక్తిమంతమైన దాడులు తట్టుకునేలా తయారు చేసినవేనని తెలుస్తోంది. ఇప్పటికే న్యూక్లియర్ సామర్థ్యం ఉన్న యూఎస్ఎస్ అబ్రహాం లింకన్ నౌకను ఇరాన్ సమీపంలోకి అమెరికా పంపిన సంగతి తెలిసిందే. ఇటీవలే వెనిజులా దేశాధ్యక్షుడిని మిలిటరీ చర్యతో అమెరికా బంధించిన నేపథ్యంలో.. ఖమేనీకి అలా జరగకూడదనే ఆయన అండర్‌గ్రౌండ్‌కు వెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Next Story