- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీవోకేలో చెలరేగిన అల్లర్లు.. 38 డిమాండ్లతో నిరసనలు.. ఇద్దరు మృతి
పీవోకేలో అల్లర్లు చెలరేగాయి. తమకు కనీస హక్కులు కావాలంటూ 38 డిమాండ్లతో అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో ఇద్దరు మృతిచెందారు.

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌లో హింసాత్మక అల్లర్లు చెలరేగాయి. కశ్మీరీ శరణార్థులకు రిజర్వు చేసిన 12 అసెంబ్లీ సీట్లు రద్దు చేయడంతోపాటు పలు డిమాండ్లతో అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఈ నిరసనలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు మరణించగా.. 22 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. తమకు కనీస హక్కులు కావాలంటూ ఆందోళన చేస్తూ.. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన స్థానికులపై పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతున్న గూండాలు, ఐఎస్ఐ మద్దతున్న ముస్లిం కాన్ఫరెన్స్ ప్రతినిధులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిరసనకారులు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తుండగా.. వారిని నియంత్రించడం కోసం కొందరు వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరుపడం ఈ వీడియోల్లో కనిపించింది. తమకు కనీస హక్కులు కావాలంటూ ఈ ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో స్థానిక మార్కెట్లు, షాపులు, లోకల్ బిజినెస్‌లు మూసివేశారు. నిరసనకారులు మొత్తం 38 డిమాండ్ల కోసం పోరాడుతున్నారు.






