- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జలపాతం వద్దకు వెళ్లకండి.. అయ్యప్ప భక్తులకు కేరళ అటవీశాఖ అధికారుల విజ్ఞప్తి
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులకు కేరళ అటవీశాఖ అధికారులు కీలక సూచన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే స్వాములు, భక్తులకు కేరళ అటవీశాఖ అధికారులు కీలక సూచన చేశారు. భక్తుల భద్రత దృష్ట్యా ఉరళ్ కుళి జలపాతాన్ని దర్శించవద్దని సూచించారు. తరచూ వన్యప్రాణుల దాడులు, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ జలపాతానికి దూరంగా ఉండాలని సన్నిధానం స్పెషల్ డ్యూటీ రేంజ్ ఆఫీసర్ అరవింద్ బాలకృష్ణన్ ఆదేశాలు జారీ చేశారు.
అయ్యప్ప సన్నిధానానికి అటవీమార్గం గుండా వెళ్లే కొందరు భక్తులు ఉరళ్ కుళి జలపాతం వద్ద స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారని పేర్కొన్నారు. అయితే ఈ జలపాతం వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలోకి ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించినట్లు స్పష్టం చేశారు. జలపాతం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంటుందని, ముఖ్యంగా సాయంత్రం సమయాల్లో దానికి దూరంగా ఉండాలని సూచించారు. అలాగే అటువైపు వెళ్లే మార్గం జారుతుండటంతో తరచూ భక్తులు జారి పడిపోతున్నారని తెలిపారు. శబరిమల వచ్చే భక్తులు ఈ ఆదేశాలను తప్పకుండా పాటించాల్సిందిగా అధికారులు కోరారు.






