- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
EC: అలా చేయొద్దు.. రాజకీయ పార్టీలకు సీఈసీ హెచ్చరికలు
నకిలీ కథనాలు, విఘాతం కలిగించే ప్రచారాలు మానుకోవాలని సీఈసీ రాజీవ్ కుమార్ రాజకీయ పార్టీలను అభ్యర్థించారు. దీని వల్ల ఎన్నికల ప్రక్రియపైన యువతలో భ్రమలు ఏర్పడవచ్చని అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ కథనాలు, విఘాతం కలిగించే ప్రచారాలు మానుకోవాలని సీఈసీ రాజీవ్ కుమార్ రాజకీయ పార్టీలను అభ్యర్థించారు. దీని వల్ల ఎన్నికల ప్రక్రియపైన యువతలో భ్రమలు ఏర్పడవచ్చని అన్నారు. ఢిల్లీలో జరిగిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సహా పలువురు రాజకీయనాయకులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే సీఈసీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రక్రియలకు అతి పెద్ద ముప్పుగా ఉన్న తప్పుడు సమాచారం, నకిలీ కథనాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని రాజీవ్ కుమార్ విమర్శించారు. "మన యువత నిరాశ చెందకుండా ఎన్నికల ప్రక్రియ నుండి దూరంగా వెళ్లకుండా ఉండటానికి అంతరాయం కలిగించే ప్రచారాన్ని నివారించాలని అందర్నీ కోరుతున్నాను" అని అన్నారు. ఎన్నికల ప్రక్రియ మెరుగుపరిచేందుకు ఏదైనా సూచన చేసినా, ఎలాంటి సమస్యలను లేవనెత్తినా వాటిని పూర్తి నిజాయితీతో పరిశీలిస్తామని అన్నారు. వారికి లిఖితపూర్వకంగా ఈసీ స్పందన తెలుపుతామని చెప్పుకొచ్చారు. భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారడానికి ఒక రోజు ముందు, జనవరి 25, 1950న ఈసీ ప్రారంభమైంది. కాగా.. గత 15 సంవత్సరాలుగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.






