- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Airspace: పాక్ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ
పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అడ్వైజరీ జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ గగనతలం మూసివేత కారణంగా విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అడ్వైజరీ జారీ చేసింది. అంతర్జాతీయ విమానాలు ఎక్కువ సమయం ప్రయాణిస్తున్నందున ప్యాసింజర్లకు సరైన సమాచారాన్ని పంచుకోవాలని సూచించింది. ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ సేవలను అందించాలని పేర్కొంది. ముఖ్యంగా ఐదు ప్రధాన రంగాలపై దృష్టి పెట్టాలని వెల్లడించింది. ప్రీ-ఫ్లైట్ ప్యాసింజర్ కమ్యూనికేషన్, ఇన్-ఫ్లైట్ క్యాటరింగ్ సౌకర్యం, వైద్య సంసిద్ధత, ప్రత్యామ్నాయ ఏరోడ్రోమ్‌లు, కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్, ఇంట్రా డిపార్ట్ మెంటల్ కో ఆర్డినేషన్ ముఖ్యమని సూచించింది.
ఎయిర్ లైన్ కార్యకలాపాలపై ప్రభావం
అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్ మూసివేతలు, ఓవర్‌ఫ్లైట్ పరిమితులకు సంబంధించిన ఇటీవలి పరిణామాల కారణంగా ఎయిర్‌లైన్ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ, ప్రాంతీయ విమానాల రూటింగ్ గణనీయంగా తగ్గడం, షెడ్యూల్ చేసిన సమయాలతో పోలిస్తే బ్లాక్ సమయాలు పెరగాయంది. కార్యాచరణ లేదా ఇంధన అవసరాల కోసం మార్గమధ్యలో సాంకేతికంగా ఆగిపోయే అవకాశం ఉందంది. ఎయిర్‌స్పేస్ పరిమితుల కారణంగా రూటింగ్‌లో మార్పు, ప్రయాణ సమయం అంచనా గురించి ప్రయాణికులందరికీలకు ముందుగానే తెలిసేలా విమానయాన సంస్థలు నిర్ధారించుకోవాలంది. చెక్-ఇన్, బోర్డింగ్ గేట్ల వద్దే కాకుండా, సాధ్యమైన ప్రతిచోటా ప్రయాణికులకు ఈ విషయం తెలియజేయాలంది. ఎస్ఎంఎస్ లేదా ఇ-మెయిల్ హెచ్చరికల ద్వారా సమాచారాన్ని తెలియజేయాలని ఆదేశించింది. కాగా.. పెహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీంతో, భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ విమానయాన సంస్థలు తమ వైమానిక ప్రాంతాన్ని వాడకుండా నిషేధించింది. దీంతో, డీసీజీఏ పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.






