- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shashi Tharoor: నేను కాంగ్రెస్ కోసమే ఉన్నా
కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కి అధిష్ఠానానికి మధ్య విబేధాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏమిటనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో శశిథరూర్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కి అధిష్ఠానానికి మధ్య విబేధాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏమిటనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో శశిథరూర్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు చ్చాయి. కాగా.. ఈ వార్తలను శశిథరూర్ ఖండించారు. కాగా.. ఐఇ మలయాళ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..ఈ పుకార్లను ఆయన తోసిపుచ్చారు. ‘కాంగ్రెస్ కోసమే ఉన్నా.. అవసరం లేదంటే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి’ హెచ్చరించారు. పార్టీతో తనకు కేవలం అభిప్రాయాల్లో తేడాలు మాత్రమే ఉన్నాయని.. కాంగ్రెస్ ని వీడటం లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ రాజకీయ నాయకుడిగా భావించలేదని.. తనకు సంకుచిత రాజకీయ ఆలోచనలు ఉన్నాయని అన్నారు. కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ తన పరిథిని విస్తరించాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని.. ఈసమయంలో కేరళ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. కేరళ యూనిట్‌లో నాయకుడు లేడనే తన అభిప్రాయానికి పార్టీ ఇతర నేతలు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, స్వతంత్ర సంస్థలు నిర్వహించిన అభిప్రాయ సేకరణలను ఆయన ఉదహరించారు. కేరళ చీఫ్ పదవి కోసం ఇతరుల కంటే తానే ముందున్నాననే విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఓటర్లను ఆకర్షించకపోతే.. వరుసగా మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందన్నారు. మరోవైపు తనకు, కాంగ్రెస్‌కు మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలపైన స్పిందించేందుకు ఆయన నిరాకరించారు.
సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు
మరోవైపు, శశిథరూర్ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన పోస్టు పెట్టారు. 18వ శతాబ్దం నాటి ఆంగ్ల కవి థామస్ గ్రే కవితలోని పదాలను ఆయన షేర్ చేశారు. ''అజ్ఞానం ఆనందంగా ఉన్న చోట తెలివిగా ఉండటం మూర్ఖత్వం'' అనే అర్థం వచ్చేలా ఆ కవిత ఉంది. శశిథరూర్ ఇటీవలే కేరళ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. అంతేకాకుండా, ప్రధానమంత్రి అమెరికా పర్యటనపై సైతం ప్రశంసలు కురిపించారు. వీటిపై కాంగ్రెస్ పార్టీ గుర్రుమంటోందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆయన క్లారిటీ కూడా ఇచ్చారు. తాను 16 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రభుత్వంలో తమ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఇతర పార్టీ ప్రభుత్వం ఉన్నా మంచి పనులు చేస్తే ప్రశంసించడం, తప్పు చేస్తే నిలదీయడం తన నైజమని చెప్పారు. కేరళలోని ప్రస్తుత లెఫ్ట్ హయాంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృద్ధి గురించి చెప్పానని.. ప్రభుత్వం గురించి కాదని వివరించారు. ప్రభుత్వం చేయాల్సిందే చాలానే ఉందని అన్నారు. ఆర్టికల్ మొత్తం చదవి మాట్లాడాలే కానీ ఏదో ఒక లైను ఆధారంగా చేసుకుని కామెంట్ చేయడం సరికాదని ఆయన అన్నారు.






