Australia: ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ హవా.. మరోసారి పీఎంగా ఆంథోనీ అల్బనీస్ !

by B.Srinivas |

అస్ట్రేలియాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు షురూ అయిన పోలింగ్ 6 గంటల వరకు కొనసాగింది.

Australia: ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ హవా.. మరోసారి పీఎంగా ఆంథోనీ అల్బనీస్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: అస్ట్రేలియా (Australia) లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు షురూ అయిన పోలింగ్ 6 గంటల వరకు కొనసాగింది. 18.1 మిలియన్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఓటింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఆదివారం నాటికి పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. ఓటు వేయడం తప్పనిసరి అయిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. 2022లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 90 శాంతం మంది ఓటేశారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అనేక సమస్యలున్నాయి. ధరల పెరుగుదల, ఇండ్ల కొరత లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2022లో లేబర్ పార్టీ ఎన్నికైన తర్వాత వార్షిక ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరుకుంది. దీంతో ఇండ్ల ధరలు, అద్దెలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రజలు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

రెండు పార్టీల మధ్యే పోటీ?

ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ (Anthony Albanis) కు చెందిన లేబర్ పార్టీ (Labour party), ప్రతిపక్ష నాయకుడు పీటర్ డట్టన్ నేతృత్వంలోని లిబరల్-నేషనల్ (Liberal national) కూటమి మధ్య ఉంది. అయితే మరోసారి లేబర్ పార్టీనే అధికారంలోకి రాబోతుందని పలు కథనాలు పేర్కొన్నాయి. దేశంలోని మొత్తం 150 సీట్లకు గాను లేబర్ పార్టీకి 70, లిబరల్ నేషనల్ కూటమికి 31, ఇతర పార్టీలు, స్వతంత్రులకు 13 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. ఇదే జరిగితే ప్రస్తుత ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరోసారి పీఎంగా ఎన్నికల కానున్నారు. మరికొన్ని సర్వేలు హంగ్ వస్తుందని అంచనా వేశాయి. కాగా, ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా పార్లమెంటును రద్దు చేసిన విషయం తెలిసిందే.

Next Story