ప్రయాణికులకు అలర్ట్.. ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు అధికారిక మార్పు.. ఇకపై ‘ఛత్రపతి శంభాజీనగర్’

by Ramesh Naini |

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరు అధికారికంగా మారిపోయింది.

ప్రయాణికులకు అలర్ట్.. ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు అధికారిక మార్పు.. ఇకపై ‘ఛత్రపతి శంభాజీనగర్’
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ (Aurangabad Railway Station) పేరు అధికారికంగా మారిపోయింది. ఎంతో కాలంగా స్థానిక ప్రజలు ఈ రైల్వే స్టేషన్ పేరును మార్చాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) ద్వారా ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ పేరును ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్‌గా మార్చారు. ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్‌ పేరు ఇకపై (Chhatrapati Shambhaji Nagar) “ఛత్రపతి శంభాజీనగర్”గా మార్చబడింది.. అని తాజాగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారికంగా ప్రకటించింది.

నాందేడ్‌ డివిజన్‌ పరిధిలోని ఈ స్టేషన్‌ పేరు మార్పును సంబంధిత అధికారులు ఆమోదించారు. కొత్తగా ఈ స్టేషన్‌కు “CPSN” (CHHATRAPATI SAMBHAJINAGAR) అనే రైల్వే కోడ్‌ కేటాయించినట్లు ప్రకటనలో పేర్కొంది. ఇకపై రైల్వే టికెట్లు, టైమ్‌టేబుళ్లు, బోర్డులు, ఇతర అధికారిక రికార్డుల్లో ఔరంగాబాద్‌ స్థానంలో ఛత్రపతి శంభాజీ నగర్‌ పేరును ఉపయోగించనున్నట్లు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ చేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి..

Next Story