Lalit Modi: లలిత్ మోడీ పాస్‌పోర్ట్ క్యాన్సిల్

by Shamantha N |

ఐపీఎల్ ఫౌండర్, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ(Lalit Modi)కి పసిఫిక్ ద్వీప దేశం నవాటు(Vanuatu) షాక్ ఇచ్చింది. ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోథం నపాట్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశాలు జారీ చేశారు.

Lalit Modi: లలిత్ మోడీ పాస్‌పోర్ట్ క్యాన్సిల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐపీఎల్ ఫౌండర్, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ(Lalit Modi)కి పసిఫిక్ ద్వీప దేశం నవాటు(Vanuatu) షాక్ ఇచ్చింది. ఆయనకు జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని జోథం నపాట్ పౌరసత్వ కమిషన్‌ను ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఆ దేశానికి మకాం మార్చేందుకు లలిత్ వనౌతుకు చెందిన గోల్డెన్‌ పాస్‌పోర్టును తీసుకున్నట్లు కథనాలు వెల్లడయ్యాయి. అయితే, ఇలాంటి టైంలో అతడికి పౌరసత్వం రద్దు చేయడం గమనార్హం. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకునేందుకు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోందని ప్రధాని నపాట్ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘దరఖాస్తు సమయంలో నిర్వహించిన ఇంటర్‌పోల్ స్క్రీనింగ్‌లతో సహా అన్ని ప్రామాణిక నేపథ్య తనిఖీలలో లలిత్‌ మోడీపై ఎటువంటి నేరారోపణలు లేవని తేలింది. అయితే గత 24 గంటల్లో ఆయనపై హెచ్చరిక నోటీసు జారీ చేయాలని భారత అధికారులు ఇంటర్‌పోల్‌కు రెండుసార్లు అభ్యర్థనలు చేసినట్లు మాకు తెలిసింది. అయితే తగిన ఆధారాలు లేనందువల్ల వారి అభ్యర్థనలను ఇంటర్‌పోల్ తిరస్కరించింది. వనౌతు పౌరసత్వం పొందడానికి చట్టబద్దమైన కారణాలు ఉండాలి. స్వదేశంలో దర్యాప్తును తప్పించుకోవడానికి అతడు వనౌతు పౌరసత్వం తీసుకున్నాడని తెలుస్తోంది. చట్టబద్ద కారణం చూపించకపోవడంతో లేకపోవడంతో లలిత్‌ పౌరసత్వం రద్దు చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని వనౌతు ప్రధాని పేర్కొన్నారు.

భారత్ రప్పించేందుకు యత్నాలు

లలిత్ మోడీ వనౌతు సిటిజన్ షిప్ తీసుకోవడంతో ఆయన తన భారత పాస్ పోర్టును అప్పగించేందుకు లండన్ లోని రాయబార కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపైనే విదేశాంగ శాఖ స్పందించింది. అయితే, అతడిపై ఉన్న కేసును చట్ట ప్రకారమే కొనసాగిస్తామంది. ఐపీఎల్ చీఫ్ గా లలిత్ మోడీ ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానిక పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారులకు దొరక్కుండా దాదాపు 15 ఏళ్లుగా ఆయన లండన్ లోనే ఉంటున్నాడు. దీంతో, ఆయన్ని తిరిగి భారత్ రప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టైంలోనే ఆయన వనౌతులో సెటిల్ అయిపోయేందుకు రెడీ అయ్యాడు.

Next Story