యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం

by Yella Dhawani Reddy |

ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో అమానుష ఘటన వెలుగుచూసింది.

యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్యపై అత్యాచార యత్నం
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశా రాష్ట్రం (Odisha) బాలేశ్వర్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఫకీర్ మొహన్ యూనివర్సిటీ (Fakir Mohan University) క్యాంపస్‌లోని అధికార నివాసంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్యపై అత్యాచారం ప్రయత్నం జరిగింది. శనివారం మధ్యాహ్నం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంట్లో లేని సమయంలో నిందితుడు ఎల్పీజీ సిలిండర్ మెకానిక్ అని, గ్యాస్ సిలిండర్‌ను తనిఖీ చేయాలని ఇంట్లోకి ప్రవేశించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్య ఇంటి తలుపు తీయగానే లోపలికి వెళ్లి తలుపు లాక్ చేసి ఆమెపై దాడికి యత్నించాడు. అయితే, వెంటనే ఆమె మరో గదిలోకి పరుగెత్తి తలుపు లాక్ చేసుకుని తన భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఆయన భద్రతా సిబ్బందికి తెలుపడంతో తక్షణమే స్పందించి ఘటన స్థలానికి వచ్చి దుండగుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని నిలగిరి ప్రాంతానికి చెందిన శంకర్ పట్రాగా గుర్తించారు. ఈ ఘటనతో ఫకీర్ మొహన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story