రైల్వే ట్రాక్‌ బ్లాస్ట్ చేసేందుకు యత్నం.. ప్రాణాలు కోల్పోయిన నిందితుడు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-28 09:23:34  IST  )

పంజాబ్‌లోని రాజ్‌పురాలో ఢిల్లీ-రాజ్‌పురా రైల్వే ట్రాక్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది.

రైల్వే ట్రాక్‌ బ్లాస్ట్ చేసేందుకు యత్నం.. ప్రాణాలు కోల్పోయిన నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లోని పాటియాలా (Patiala) జిల్లా రాజ్‌పురా సమీపంలో జరిగిన భారీ పేలుడు ఘటన భయాందోళనలకు గురిచేసింది. ఢిల్లీ-రాజ్‌పురా రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన పేలుడులో ఓ అనుమానిత వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. రైల్వే ట్రాక్‌కు సమీపంలో ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో ఈ పేలుడు సంభవించింది. ఘటన జరిగిన వెంటనే రైల్వే రక్షణ దళం (RPF), పంజాబ్ పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది స్పాట్‌కు చేరుకునన్నారు. ఢిల్లీ-రాజ్‌పురా మధ్య ఉన్న ఈ రైల్వే ట్రాక్ అత్యంత కీలకమైనది కావడంతో, అధికారులు ట్రాక్ పొడవునా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఘటనా స్థలం నుంచి ఓ సిమ్‌కార్డ్‌ కూడా లభ్యమైంది.

ఉగ్రకోణంపై ఆరా..

ఇది ప్రమాదవశాత్తు జరిగిన పేలుడా లేక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించి పరిశోధిస్తున్నట్లుగా ఎస్ఎస్‌పీ వరుణ్ శర్మ తెలిపారు.

Next Story