Eknath Shinde : మరాఠాలపై దాడులు సహించేది లేదు : ఏక్ నాథ్ షిండే వార్నింగ్

by Muthe.Rajitha |   (  Updated:2024-12-20 15:08:30  IST  )

ఇటీవల మహారాష్ట్ర(Maharashtra)లోని కళ్యాణ్(Kalyan) లో ఓ మరాఠా కుటుంబంపై జరిగిన దాడిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే(Deputy CM Eknath Shinde) తీవ్రంగా స్పందించారు.

Eknath Shinde : మరాఠాలపై దాడులు సహించేది లేదు : ఏక్ నాథ్ షిండే వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల మహారాష్ట్ర(Maharashtra)లోని కళ్యాణ్(Kalyan) లో ఓ మరాఠా కుటుంబంపై జరిగిన దాడిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే(Deputy CM Eknath Shinde) తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మరాఠా ప్రజలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఠానే జిల్లాలో కళ్యాణ్ లో ఓ మరాఠీ కుటుంబంపై ప్రభుత్వ ఉద్యోగులైన పొరుగువారు దాడికి పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ శాసనమండలిలో ప్రకటన చేశారని షిండే గుర్తు చేశారు. మరాఠాల హక్కులు కాపాడేందుకే స్వర్గీయ బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారని, తాము ఉన్నంతకాలం మరాఠాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పేర్కొన్నారు.

Next Story