- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బౌద్ధ ఆరామంపై దాడి.. 23 మంది మృతి
by Muthe.Rajitha |
మయన్మార్(Myanmar)లోని ఓ బౌద్ధ ఆరామం(Buddhist monastery)పై దాడి జరగడంతో 23 మంది మరణించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మయన్మార్(Myanmar)లోని ఓ బౌద్ధ ఆరామం(Buddhist monastery)పై దాడి జరగడంతో 23 మంది మరణించారు. మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతంలోని లిన్ తాలు గ్రామంలో ఉన్న ఒక బౌద్ధ ఆరామంపై నేడు వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 23 మంది మరణించారని సమాచారం. వీరిలో నలుగురు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ 150 మందికి పైగా సమీప గ్రామాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
ఒక జెట్ ఫైటర్ అర్ధరాత్రి 1 గంటల సమయంలో (సింగపూర్ సమయం 2:30 AM) ఆరామంలోని ఒక భవనంపై బాంబు వేసిందని మీడియాకు తెలిపారు. ఈ దాడిలో 23 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బర్మా మీడియా మరణాల సంఖ్య 30 వరకు ఉండవచ్చని అంచనా వేస్తోంది.
Next Story






