- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై దాడి.. వారికి కూడా బుల్లెట్ దింపుతామని వార్నింగ్
by Muthe.Rajitha |
బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై దుండకులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ విన్నర్ ఇంటిపై దుండకులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఎవరూ గాయపడగా పోయినా.. ప్రముఖ యూట్యూబర్, గాయకుడు, బిగ్ బాస్ 2 (హిందీ) విజేత అయిన ఎల్విష్ యాదవ్ ఇంటిమీద గుర్తు తెలియని వ్యక్తులు 24 రౌండ్ల కాల్పులు జరపడం సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. ఇంతలో ఈ ఘటనకు పాల్పడింది తామేనని హిమాంశు భావు, నీరజ్ ఫరీద్ వూరియా గ్యాంగ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఈరోజు మేము ఏంటో ఎల్విష్ కు రుచి చూపించామన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రచారంతో ఆటను ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశాడని మండిపడ్డారు. ఎల్విష్ లాంటి చీడపురుగులు ఇదో గట్టి హెచ్చరికగా పేర్కొన్నారు. మరోసారి ఎవరైనా ఇలాంటి యాప్స్ ప్రచారం చేస్తే.. వారికి కూడా ఏ క్షణమైనా బుల్లెట్ దింపుతామని వార్నింగ్ ఇచ్చారు.
Next Story






