అట్టుడుకుతున్న బెంగాల్.. మరో ఎంపీపై దాడి

by Prasad Jukanti |

పశ్చిమబెంగాల్‍లో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు టీఎంసీ ఎంపీలపై దాడులు జరగడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అట్టుడుకుతున్న బెంగాల్.. మరో ఎంపీపై దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమబెంగాల్‍లో ప్రతిపక్ష టీఎంసీ ఎంపీలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లా సోనాపూర్‍లో నిన్న మమతాబెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై రాళ్లు, కోడిగుడ్ల దాడి ఘటన మరువక ముందే తాజాగా ఆ పార్టీకి చెందిన మరో ఎంపీపై దాడి జరిగింది. ఇవాళ ఉదయం హుగ్లీ జిల్లా చెండితాల పోలీస్ స్టేషన్ బయట టీఎంసీ-బీజేపీ కార్యకర్తల మధ్య ధర్షణ చోటు చేసుకుంది. ఈ సమంయలో ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి చేశారు.

ఒక్కసారిగా ఎటాక్:

ఇటీవల అరెస్టైన తమ పార్టీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ లో వినతి పత్రం ఇచ్చేందుకు ఎంపీ కల్యాణ్ బెనర్జీ తన కార్యకర్తలతో పాటు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ కు నడుచుకూంటూ వెళ్తున్న క్రమంలో కేంద్ర బలగాలు ఎంపీని ఆపి ప్రశ్నిస్తుండగా వెనక నుంచి వచ్చిన రాయి బెనర్జీ తలకు తగిలింది. దీంతో ఆయన హఠాత్తుగా నేలపై పడిపోయారు. నిన్న అభిషేక్ బెనర్జీపై దాడి జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఎంపీపై ఎటాక్ జరగడంతో బెంగాల్ రాజకీయం అట్టుడుకుతోంది.

Next Story