- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాట్నాలో దారుణం: మూడేళ్ల మేనకోడలిపై ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారం
మాదకద్రవ్యాలకు బానిసైన ఓ యువకుడు (22), నిద్రిస్తున్న తన మూడేళ్ల మేనకోడలిని సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: పాట్నాలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదకద్రవ్యాలకు బానిసైన ఓ యువకుడు (22), నిద్రిస్తున్న తన మూడేళ్ల మేనకోడలిని సమీపంలోని పొలాల్లోకి ఎత్తుకెళ్లి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి అరుపులు విని స్థానికులు కేకలు వేయడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న చిన్నారిని కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే స్పందించిన పోలీసులు బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాన నిందితుడైన మేనమామతో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ జరుపుతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.






