- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్‌లో దారుణం: అనుమానంతో భార్య, ముగ్గురు పిల్లల హత్య
by samatah |
బిలాస్‌పూర్ జిల్లా హిర్రీ గ్రామానికి చెందిన ఉమేంద్ర కేవత్ అనే 34ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు మైనర్ పిల్లలను గొంతుకోసి హత్య చేశాడు.

X
దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌లో దారుణం చోటు చేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లా మస్తూరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హిర్రీ గ్రామానికి చెందిన ఉమేంద్ర కేవత్ అనే 34ఏళ్ల వ్యక్తి తన భార్య, ముగ్గురు మైనర్ పిల్లలను గొంతుకోసి హత్య చేశాడు. ఇందులో ఇద్దరు ఐదేళ్ల ఆడపిల్లలు కాగా.. 2ఏళ్ల బాలుడు ఉన్నాడు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే నిందితుడు దారుణానికి ఒడిగట్టాడని, సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టు బిలాస్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ సంతోష్ సింగ్ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. హత్యానేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.
Next Story






