- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుణాచల గిరి ప్రదక్షిణలో దారుణం.. బైక్‌పై వచ్చి తెలంగాణ భక్తుడి హత్య
తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామిని దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamilnadu)రాష్ట్రం తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరస్వామిని (Arunachalam) దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని హిందువులు నమ్ముతారు. అంతటి పవిత్రమైన గిరిప్రదక్షిణలో శుక్రవారం వేకువజామున భయానక ఘటన జరిగింది. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తుడిని కత్తితో పొడిచి చంపేశారు. వివరాల్లోకి వెళ్లితే.. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) సౌందరాపురం గ్రామానికి చెందిన భక్తుడు విద్యాసాగర్ (32) అరుణాచలం దైవ దర్శనానికి వెళ్లాడు. శుక్రవారం వేకువజామున గిరిప్రదక్షిణ చేస్తున్న సమయంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అతన్ని ఢీకొట్టారు.
కిందపడిన విద్యాసాగర్ వారితో వాగ్వాదానికి దిగగా, ఆక్రోశించిన యువకులు తమ వద్ద ఉన్న కత్తితో అతనిపై విచక్షరహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను తోటి భక్తులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై స్పందించిన పోలీసులు మృతుడిపై దాడి చేసిన గుగనేశ్వరన్ (22), తమిళరసన్ (25) అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. తిరువణ్ణామలైలో భక్తుల మధ్య ఈ హత్య కలకలం రేపింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






