- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rahul Gandhi : యూపీలో దళితులపై పెరిగిన దౌర్జన్యాలు : రాహుల్ గాంధీ
ఉత్తర ప్రదేశ్(UP)రాష్ట్రంలో దళిత, బహుజన వ్యతిరేక బీజేపీ పాలన(BJP Government)లో దళితులపై జుగుప్సాకరమైన దౌర్జన్యాలు, అన్యాయాలు, హత్యలు(Atrocities Against Dalits) హద్దులేకుండా పెరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhio)ఎక్స్ వేదికగా మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్(UP)రాష్ట్రంలో దళిత, బహుజన వ్యతిరేక బీజేపీ పాలన(BJP Government)లో దళితులపై జుగుప్సాకరమైన దౌర్జన్యాలు, అన్యాయాలు, హత్యలు(Atrocities Against Dalits) హద్దులేకుండా పెరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhio)ఎక్స్ వేదికగా మండిపడ్డారు. అయోధ్యలో దళిత యువతిపై అత్యాచారం, హత్య చేయడం హృదయ విదారకమైన, చాలా సిగ్గుచేటు చర్యగా విమర్శించారు. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన దళిత యువతి కోసం బాధిత కుటుంబం చేసిన ఫిర్యాదుపై ప్రభుత్వం స్పందించి ఉంటే బహుశా ఆమె జీవితాన్ని రక్షించి ఉండేవారన్నారు.
ఈ దారుణ ఘటనతో మరో ఆడబిడ్డ జీవితం ముగిసిపోయిందని.. ఇంకెంత కాలం, ఎన్ని కుటుంబాలు ఇలా ఏడ్చి బాధ పడాలోనని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నేరంపై తక్షణమే విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విచారణ పేరుతో..లేక ఘటనను కప్పిపుచ్చుకునేందుకో బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా న్యాయం అందించాలన్నారు. దేశంలోని ఆడబిడ్డలు, మొత్తం దళిత సమాజం న్యాయం కోసం మీ వైపు చూస్తోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
యూపీలో మహాకుంభ మేళా కొనసాగుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రభుత్వంపై విపక్షాలు విమర్శల దాడి చేస్తున్నాయి. అయోధ్య జిల్లాలో ఒక కాలువలో అత్యాచారం, హత్యకు గురైన దళిత యువతిలి మృతదేహం లభించింది. ఆమె గురువారం రాత్రి ఒక మతపరమై సమావేశానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోలేదని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతదేహానికి దుస్తులు లేకుండా, శరీరంపై గాయాలు కనిపించాయని, ఆమెను తాళ్లతో కట్టివేశారని కుటుంబీకులు ఆరోపించారు.






