- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral: ఏటీఎం కార్డు మార్చి.. మహిళ ఖాతాలో రూ.55 వేలు స్వాహా
by Ramesh Naini |
ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వచ్చిన ఓ మహిళను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.55 వేలు కాజేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వచ్చిన ఓ మహిళను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.55 వేలు కాజేశారు. బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లా కవాయియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీబీఐ ఏటీఎంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నగదు తీసుకునేందుకు వచ్చిన మహిళను ఇద్దరు దుండగులు మాటల్లో పెట్టి, చాకచక్యంగా ఆమె ఏటీఎం కార్డును మార్చేశారు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి డబ్బును తస్కరించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల చేతికి ఏటీఎం కార్డులు ఇవ్వొద్దని, పిన్ నెంబర్ రహస్యంగా ఉంచుకోవాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
Next Story






