- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Atishi: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అతిషీ
ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తొలిసారిగా మహిళ ఎంపికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తొలిసారిగా మహిళ ఎంపికయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిషీ ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఆప్ శాసనసభాపక్ష సమవేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఆప్ ఎమ్మెల్యేల భేటీ అయ్యింది. 22 మంది ఎమ్మెల్యేలు భేటీలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా తిషీ పేరుని ఎమ్మెల్యే సంజీవ్ ఝా ప్రతిపాదించారు. దీంతో, ఆమెను ప్రతిపక్ష నేతగా మిగితా నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఢిల్లీ సీఎం రేఖ గుప్తాను ఎదుర్కొనేందుకు బలమైన మహిళా నేత అవసరమని ఆప్ నేతలు పేర్కొన్నారు. కాగా, ప్రతిపక్ష నాయకురాలిగా తనను ఎన్నుకోవడం పట్ల అతిషీ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యేకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ‘బలమైన ప్రతిపక్షం ప్రజల గొంతును లేవనెత్తుతుంది. బీజేపీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేలా ఆప్ ప్రయత్నిస్తుంది’ అని అన్నారు.
మూడ్రోజులపాటు అసెంబ్లీ ఎన్నికలు
మరోవైపు, ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరిగాయి. 48 స్థానాలను గెలుచుకున్న బీజేపీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత దేశ రాజధానిలో అధికారంలోకి వచ్చింది. ఆప్ 22 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలువలేకపోయింది. కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతిషీ బీజేపీ నేత రమేష్ బిధూరీపై ఘన విజయం సాధించారు. కాకపోతే, ఆప్ చీఫ్ కేజ్రీవాల్, కీలక నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ అసెంబ్లీలో ఓటమిపాలయ్యారు. మరోవైపు, సోమవారం నుంచి మూడు రోజులపాటు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.






