- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Atishi: గుజరాత్, గోవా ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. ఆప్ నేత అతిశీ
గుజరాత్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆప్ నేత, మాజీ సీఎం అతిశీ తేల్చి చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: 2027లో జరిగే గుజరాత్ (Gujarath), గోవా (Goa) అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) నేత, ఢిల్లీ మాజీ సీఎం అతిశీ (Athishi) తేల్చి చెప్పారు. గోవాలోని మార్గోవాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గోవా, గుజరాత్ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు పొత్తులపై ఎటువంటి చర్చలూ జరగలేదు’ అని తెలిపారు. 2022లో గోవా ప్రజలు బీజేపీకి ఓటు వేశారని, కాంగ్రెస్ సైతం 11 సీట్లు గెలుచుకుందని కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలలో 8 మంది తరువాత కాషాయ పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని, ఆప్‌కు ఇద్దరు శాసనసభ్యులు ఉన్నారని చెప్పారు.
‘2022 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు ఇద్దరూ గెలిచినప్పుడు వారు రెండు నెలలు కూడా పార్టీలో ఉండరని పుకార్లు వచ్చాయి. వారు డబ్బు సంపాదిచడానికి రాజకీయాల్లోకి రాలేదు. కాబట్టి వారు ఇప్పటికీ పార్టీలోనే ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీలో చేరారు. బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించడానికి ప్రయత్నించింది. కానీ ఆప్ నేతలు ఏ మాత్రం లొంగిపోలేదు’ అని తెలిపారు. ఎన్నికల్లో గెలవడం, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉన్న రాజకీయాలపై తమకు ఆసక్తి లేదని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం అతిశీ స్పందిస్తూ.. దేశ రాజధానిలో ఆప్ ఓడిపోతే కరెంట్ కోతలు మొదలవుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నాణ్యత మళ్లీ దారుణంగా మారుతుందని కేజ్రీవాల్ హెచ్చరించారని, ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరిస్తోందని మండిపడ్డారు.






