- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > సీజేఐ, యూపీ సీఎంకు గ్యాంగ్‌స్టర్ అతిక్ రహస్య లేఖ.. కీలక విషయాన్ని బయటపెట్టిన గ్యాంగ్‌స్టర్ లాయర్
సీజేఐ, యూపీ సీఎంకు గ్యాంగ్‌స్టర్ అతిక్ రహస్య లేఖ.. కీలక విషయాన్ని బయటపెట్టిన గ్యాంగ్‌స్టర్ లాయర్
by Vinod kumar |
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ న్యాయవాది విజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు.

X
లక్నో: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ న్యాయవాది విజయ్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అతిక్ కొన్ని విషయాలను యూపీ సీఎం, సీజేఐకి చేరవేయాలని భావించినట్లు చెప్పారు. ఈ మేరకు ఓ రహస్య లేఖలో తన సూచనలు రాసి సీల్డ్ చేశారని తెలిపారు. అయితే ఈ లేఖను ఇతర వ్యక్తులు ద్వారా పంపనున్నట్లు చెప్పారు. లేఖలో ఎలాంటి విషయాలు ఉన్నాయో తనకు తెలియదని చెప్పారు. అతిక్‌పై ఏదైనా దాడి లేదా హత్య జరిగితే సీల్డ్ కవర్‌ను సీజేఐకి, యూపీ సీఎంకు చేరవేయాలని కోరినట్లు మిశ్రా చెప్పారు.
కాగా, మూడు రోజుల క్రితం అతిక్ తన సోదరుడితో కలిసి మీడియాతో మాట్లాడుతుండగా ముగ్గురు వ్యక్తులు వారిని కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా లేఖపై స్పష్టత రావాల్సి ఉంది. అందులో ఏం అంశాలు ఉన్నాయనే విషయం కూడా తెలియాల్సి ఉంది.
- Tags
- Atiq Ahmed
- Lawyer
Next Story






