- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Athawale: రాహుల్, ఉద్థవ్‌లను హిందూ ఓటర్లు బహిష్కరించాలి.. కేంద్ర మంత్రి అథవాలే
రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాక్రేలు హిందువులను అవమానించారని, కాబట్టి హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని రాందాస్ అథవాలే అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumba mela) ను సందర్శించకుండా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi), శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే (Udhav thakraey)లు హిందువులను అవమానించారని, కాబట్టి హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. థాక్రే నిరంతరం హిందుత్వం గురించి మాట్లాడతారని కానీ కుంభమేళాలో ఎందుకు పాల్గొన లేదని ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మహా కుంభ్‌లో పాల్గొనకుండా థాక్రే, గాంధీ కుటుంబం హిందుత్వాన్ని అవమానించారు. హిందువుగా ఉండి మహా కుంభమేళాకు హాజరు కాకపోవడం సరికాదు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని వారు మహా కుంభ్‌లో పాల్గొనాల్సింది’ అని వ్యాఖ్యానించారు.
‘వారు ఎల్లప్పుడూ హిందూ ఓట్లను కోరుకుంటారు. కానీ అత్యంత పవిత్రమైన మహాకుంభమేళాను దాటవేశారు. కాబట్టి హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలని భావిస్తున్నా’ అని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ నాయకులకు హిందువులు గుణపాఠం నేర్పించారన్నారు. హిందూ ప్రజల మనోభావాలపై వారికి గౌరవం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఫైర్ అయ్యారు. కాగా, యూపీలోని ప్రయాగ్ రాజ్ నగరంలో గత నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26న ముగియనున్న విషయం తెలిసిందే. అయితే ఈ జాతరకు రాహుల్, ఉద్ధవ్‌లు ఇద్దరూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే అథవావే విమర్శలు గుప్పించారు.






