BREAKING: దేశంలో కుప్పకూలిన ATC వ్యవస్థ.. ఢిల్లీలో 500 విమానాలు ఆలస్యం

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-07 13:05:44  IST  )

దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థ కుప్పకూలింది.

BREAKING: దేశంలో కుప్పకూలిన ATC వ్యవస్థ.. ఢిల్లీలో 500 విమానాలు ఆలస్యం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాల్లోని ఎయిర్ పోర్టుల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థ కుప్పకూలింది. దీంతో విమానాల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ, ముంబై ఎయిర్ పోర్టుల్లో ప్రయాణికుల రద్దీ ఏర్పడింది. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉన్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో 500కి పైగా విమానాలు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే షెడ్యూల్ చేసిన విమానాలను కూడా అధికారులు రద్దు చేశారు. ఆటోమెటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (AMSS)ను పునరుద్ధరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ATCపై సైబర్ అటాక్ జరగడంతోనే ఆటోమేషన్ వైఫల్యం జరిగినట్లు అనుమానిస్టున్నారు. మాల్ వేర్ చొరబాటును సాఫ్ట్వేర్ సహాయంతో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Next Story